మన్యం న్యూస్, మంగపేట.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అభయ హస్తం ఆరు గ్యారంటీలకు గాను ఐదు గ్యారంటీ లకు లబ్దిదారులు దరఖాస్తులు పెట్టుకోవటానికి మంగపేట మండలం వ్యాప్తంగా ప్రజలు పోటీ పడ్డారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలకు గాను అయిదు గ్యారెంటీ లు 1.మహా లక్ష్మి పథకం 2. రైతు భరోసా 3. ఇందిరమ్మ ఇండ్లు 4. గృహ జ్యోతి 5.చేయూత పథకం లకు అర్హులైన అభ్యర్థులనుండి మండలం వ్యాప్తంగా గ్రామ పంచాయితీల వద్ద, రైతు వేదికల వద్ద గ్రామ పంచాయతీ అధికారులఆధ్వర్యంలో, ,అంగన్వడీ టీచర్లు, ఆశ వర్కర్స్, తదితరులు ఆధ్వర్యంలో కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ప్రజా పాలనా అభయహస్తం దరఖాస్తు ల కార్యక్రమం నకు పోలీసులతో గట్టి బందోబస్తు నిర్వహించడం జరిగింది.