రెబల్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీ నైజాంలో రూ.70 కోట్ల కలెక్షన్లను సాధించింది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్ల మొత్తం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. అయితే, నైజాం ఏరియాలో ‘సలార్’ భారీ టార్గెట్‌ను సెట్ చేసిన నేపథ్యంలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ ఆ కలెక్షన్లను బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దాదాపుగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ‘పుష్ప2’ ఈ ఏడాది ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
