సీనియర్ హీరో శివాజీ, ‘తొలిప్రేమ’ ఫేమ్ వాసుకీ ఆనంద్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘90స్ – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’. జనవరి 5న ఈటీవీ విన్ ఒరిజినల్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే రిలీజైన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సిరీస్‌కు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. ఎంఎస్ఓపీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజశేఖర్ మేడారం నిర్మిస్తున్నారు.
