గ్లోబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘సలార్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ సక్సెస్‌ను చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో శృతి హాసన్, స్టార్ నటుడు పృథ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు
