టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. ఫిబ్రవరిలో వారు వివాహం చేసుకుంటారని జరుగుతున్న ప్రచారంపై తాజాగా విజయ్ టీమ్ స్పందించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరింది. దీంతో వీరు పెళ్లి చేసుకుంటారనే ఊహలకు తెరపడింది.
