అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరం చేశారు. అయితే దేశ నలుమూలల నుంచి అయోధ్యకు వెళ్లే విమానాల ఛార్జీలు అనేక అంతర్జాతీయ మార్గాల్లోని విమానాల టికెట్ ధరల కంటే ఎక్కువగా ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే సింగపూర్, బ్యాంకాక్‌లకు వెళ్లడం కంటే ఇప్పుడు అయోధ్యకు వెళ్లడం ఖరీదైనదిగా మారింది. జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవానికి ముందే అయోధ్యకు పర్యాటకుల తాకిడి మొదలైంది. దాని ప్రభావం విమాన ఛార్జీలపై పైడింది
