జాతీయ ఉపాధి హామీ చట్టం ద్వారా కూలీల వేతనాల చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ బేస్టే పేమెంట్ సిస్టమ్ అమలు చేస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఈ విధానం అమల్లోకి తెచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూలీలందరికి బ్యాంకు ఖాతాల ద్వారానే కూలి చెల్లిస్తున్నారు. బ్యాంకర్లు ఆధార్ ఉంటే తప్ప ఖాతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జాబ్ కార్డుకు ఆధార్ లింకేజీ తప్పనిసరి చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్న.
