UPDATES  

 అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ.. అమెరికా టైమ్స్ స్కేర్స్ లో లైవ్ టెలీకాస్ట్…

అయోధ్యలో త్వరలో జరగబోయే శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠను.. అమెరికాలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.

 

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఆలయంలో శ్రీ రాముడి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ వేడుకను వీక్షించేందుకు కోట్లాది మంది భారతీయులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఆ కార్యక్రమాన్ని నేరుగా తిలకించేందుకు అందరికీ సాధ్యం కాదు. కాబట్టి దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు భారతీయ ఎంబసీలు, కాన్సులేట్లలోనూ లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం.

 

అంతేకాదు.. అమెరికాలోని న్యూయార్క్‌లో గల ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌లో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్త అయనట్లు సమచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాణప్రతిష్ఠ పూర్తయిన అనంతరం భక్తులనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు తెలిసింది. దీన్ని కూడా ప్రపంచవ్యాప్తంగా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు సమాచారం.

 

టైమ్స్‌ స్క్వేర్‌లో రామ మందిరాన్ని ప్రదర్శించడం తొలిసారి కాదు. 2020 ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ప్రధాని మోదీ భూమిపూజ చేశారు. అప్పుడు టైమ్స్‌ స్క్వేర్‌లో రామమందిర చిత్రాన్ని ప్రదర్శించారు.

 

జనవరి 22న అయోధ్య భవ్య రామమందిరంలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, వేలాది మంది సాధువులు హాజరుకానున్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !