యూపీలోని డియోరియాలో ఇద్దరు యువతులు సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. బెంగాల్‌కు చెందిన జయ్‌శ్రీ రౌల్ (28), రాఖీ దాస్ (23) డియోరియాలోని ఆర్కెస్ట్రా గ్రూప్‌లో పనిచేస్తున్నారు. వీరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారడంతో వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నారు. గత రెండేళ్లుగా వీరు సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఆలయంలో వివాహం చేసుకున్న వీరు తమ పెళ్లిపై నోటరీ కూడా చేయించుకున్నారు.
