సూపర్ స్టార్ రజినీకాంత్ 172వ చిత్రం పట్టాలెక్కనుంది. ఈ సినిమాకి దర్శకుడు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. మారి సెల్వరాజ్ చెప్పిన కథ నచ్చడంతో రజిని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఇక రజినీకాంత్ చేతిలో ఇప్పటికే మూడు సినిమాలు ఉన్నాయి. టీజే జ్ఞానవేళ్, లోకేశ్ కనగరాజ్, ఐశ్వర్య రజినీకాంత్లతో సినిమాలకు సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
