సంక్రాంతి రేసు నుంచి రజినీకాంత్ మూవీ తప్పుకుంది. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ’లాల్ సలామ్‘ను నిర్మించింది. ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ కపిల్ దేవ్, తదితరులు నటించారు. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 9న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
