UPDATES  

 గుంటూరు కారం సినిమా స్టోరీ ఇదేనా.. త్రివిక్రమ్ మళ్లీ కాపీ కొట్టాడా..?

సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh babu) నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. సీనియర్ నటి రమ్యకృష్ణ మహేశ్ బాబు తల్లి పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

 

అయితే ఈ సినిమా ఒక మలయాళ సినిమాకు కాపీ అని ప్రచారం జరుగుతోంది. గుంటూరు కారం ట్రైలర్ చూస్తే.. అందులో హీరో చిన్నప్పుడే అతని తల్లి అతడిని వదిలేసి.. మరో పెళ్లి చేసుకుంటుంది. హీరో పెరిగి పెద్దవాడయ్యాక.. తన తల్లి గురించి తెలుసుకొని.. ఆమె కోసం వస్తాడు. ఆ సమయంలో జరిగిన సంఘటనలే స్క్రీన్ ప్లే.

 

ఇదంతా గమనిస్తుంటే.. మలయాళంలో మమ్ముటి హీరోగా నటించిన రాజమాణిక్యం సినిమా గుర్తుకు వస్తుంది. రాజమాణిక్యం సినిమా 2005లో మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధిచింది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాకు గుర్తింపు లభించింది.

 

ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో కూడా రాజమాణిక్యం సీన్లు కనిపిస్తుండడంతో నెటిజెన్లు.. డైరెక్టర్ త్రివిక్రమ్ మళ్లీ కాపీ కొట్టేశాడోచ్.. అంటూ పోస్ట్లు పెట్టేస్తున్నారు. గతంలో కూడా పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా కథ విషయంలో కాపీకొట్టినట్లు స్పష్టంగా తెలిసిపోయింది. ఆ సమయంలో ఒక ఫ్రెంచ్ సినిమా డైరెక్టర్ తను తీసిన ‘హెయిర్ అప్పారెంట్’ సినిమా కథను కాపీ చేసినట్లు అజ్ఞాతవాసి టీమ్‌పై చట్టపరంగా చర్యలు తీసుకోగా.. ఆ వ్యవహారం కోర్టు బయట తేల్చుకున్నారు.

 

అలాగే మహేశ్‌బాబు కెరీర్‌లో పెద్ద హిట్‌గా నిలిచిన ‘అతడు’ సినిమా కూడా హిందీలో సల్మాన్ ఖాన్ రచయితగా.. హీరోగా వ్యవహరించిన ‘తుమ్ కో నా భూల్ పాయేంగే’ సినిమాకు కాపీ.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !