UPDATES  

 ‘నా సామి రంగ’ ట్రైలర్ విడుదల.. సంక్రాంతి బరిలో తగ్గేదేలే అంటున్న కిష్టయ్య!

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, రాజ్ తరుణ్, అల్లరి నరేష్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘నా సామి రంగ’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల అవుతుందనే చిత్ర యూనిట్ ప్రకటించగా.. సినిమా ట్రైలర్ ఆలస్యం కావడంతో అక్కినేని అభిమానులలో ఆందోళన కలిగింది. పైగా షూటింగ్ కూడా ఇంకా మిగిలి ఉందనే ప్రచారం జరుగుతోంది.

 

ఇలాంటి పరిస్థితుల్లో అసలు సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ నాగార్జున సంక్రాంతి బరిలో తాను ఉన్నానని మంగళవారం సినిమా ట్రైలర్ విడుదల చేసి సమాధానమిచ్చారు.

 

సినిమాలో నాగార్జున చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ఆయన పోషించిన కిష్టయ్య పాత్ర చాలా రఫ్‌గా ఉంది. సినిమా ట్రైలర్‌లో యాక్షన్‌తో పాటు, రొమాన్స్, స్నేహ సంబంధాలను చూపించారు.ఈ చిత్రానికి యువ దర్శకుడు విజయ్ బిన్నీ తెరకెక్కించారు.

 

సంక్రాంతి సినిమాలలో ఇప్పటికే అన్ని సినిమాల ట్రైలర్లు విడుదలయ్యాయి. వీటిలో ఏదీ దేనికీ తీసిపోయే విధంగా లేదు. అన్నీ పండుగకు ‘నా సామి రంగ’.. సినిమాల జాతర అనిపించే స్థాయిలో ఉన్నాయి.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !