మనిషి మరణించిన తర్వాత ముక్కులో దూది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారని చాలా మందికి సందేహాలు వచ్చే ఉంటాయి. మనిషి మరణించిన తర్వాత. ముక్కులో నుంచి, చెవిలో నుంచి ఒక ప్రత్యేకమైన ద్రవం బయటకు వస్తుంది. ఆ ద్రవాన్ని బయటకు రానివ్వకుండా ఆపడానికి దూది పెడతారు. మరణాంతరం శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా వెళ్లకుండా ఉండటానికి దూదితో ఉంచుతారు. ఇలా పెట్టడం వల్ల గాలి కూడా లోపలికి వెళ్లదు. దీంతో మృత దేహం త్వరగా పాడవ్వకుండా ఉంటుంది.
