మన్యం న్యూస్ కరకగూడెం: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలు మేరకు మండల పరిధిలోని ట్రాక్టర్ యజమానులకు ట్రాక్టర్, ట్రక్కు వెనకాల రేడియం స్టిక్కర్ లు అంటించాలని బుధవారం ఎస్ఐ రాజారామ్ ట్రాక్టర్ యజమానులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ట్రాక్టర్ యజమానులకు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, డ్రైవర్లకు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, ట్రాక్టర్లు కానీ, లారీలకు గాని, ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వెనుకాల రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు అంటించాలని, అదేవిధంగా వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా ఉద్దేశపూర్వకంగా వాహనాలు నడిపితే వారి పైన చట్టరిచ్చే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.