మన్యం న్యూస్ కరకగూడెం :అయ్యప్ప స్వామి ఇరుముడి కార్యక్రమం కరకగూడెం,మోతే గ్రామలలో ఘనంగా నిర్వహించారు. అనంతరం శబరిమలై అయ్యప్ప స్వామి సన్నిధానంలోకి వెళ్ళుటకు దీక్షలు చేపట్టిన అయ్యప్ప మాలదారులు బుధవారం స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయం నందు అత్యంత వైభవంగా ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. 41 రోజులపాటు కఠిన దీక్షలు చేసి, ప్రతి రోజు పూజ నిర్వహించిన అయ్యప్పలు ఉదయమే స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న సుమారు వందమందికి పైగా భక్తులు స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోష చేస్తూ భక్తి పరవశం నడుమ వైభవముగా ఇరుముడి కార్యక్రమాన్ని కొనసాగించారు. గురు స్వాములు చందా మధు ఆధ్వర్యంలో అయ్యప్ప మాలదారులకు ఇరుముడులు కట్టారు. ఇరుముడి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బంధువులు,మిత్రులతో ఆలయం ప్రాంగణ కోలాహలంగా మారింది. దేవాలయ వద్ద నుండి బయలుదేరిన అయ్యప్పలను భక్తులు, బంధువులు కలసి గ్రామ చివరి వరకు మేళతాళాలతో భారీ ఎత్తున ఊరేగింపు తీసుకొని వెళ్లారు.