మహేష్ బాబు-త్రివిక్రమ్ కలయికలో వస్తున్న గుంటూరు కారం సినిమాకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో గుంటూరు కారం సినిమా టికెట్లపై 50 రూపాయల పెంపునకు సీఎం జగన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 12 నుంచి వారం పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.
