ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కరీబియన్ దేశం క్యూబా ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలను 500శాతం పైగా పెంచుతున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అక్కడ లీటర్ పెట్రోల్ ధర 25 క్యూబన్ పెసోలుగా ఉండగా.. తాజా నిర్ణయంతో 132 పెసోల (రూ.450)కు చేరనుంది.
