ప్రపంచానికి కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని, ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చీఫ్ టెడ్రోస్ అథనామ్ ఘెబ్రెయెస్ అన్నారు. ఒక్క డిసెంబరు నెలలోనే కరోనా మహమ్మారితో 10 వేలమందికిపైగా మరణించారని తెలిపారు. క్రిస్మస్ సెలవుల కాలంలో కొవిడ్ జేఎన్.1 వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందిందని, దీని ప్రభావం అమెరికా, యూరప్ దేశాల్లో అధికంగా ఉందన్నారు.
