మన్యం న్యూస్, మంగపేట.
ఎమ్మెల్యేల కోటాలో బిఆర్ఎస్ పార్టీ తరఫున గతంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన దళిత సామాజిక వర్గ నేత ప్రస్తుత స్టేషన్ గణపురం శాసనసభ్యులు కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికైనందున బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అత్యంత వెనుకబడిన జిల్లా ములుగు జిల్లా గత రెండు పర్యాయలుగా ములుగు నియోజకవర్గానికి పార్టీ పరంగా శాసనసభ్యులు లేకపోవడం కారణంగా పార్టీ అభివృద్ధి ని దృష్టిలో పెట్టుకొని ములుగు నియోజకవర్గానికి ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీని ములుగు నియోజకవర్గ దళిత నాయకత్వానికి ఇవ్వవలసిందిగా బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు రాజమల్ల సుకుమార్ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి విజ్ఞప్తి చేశారు.ములుగు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ రాజకీయ పార్టీ నాయకత్వాలు కేవలం దళితులను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకుంటున్నారని పార్టీలో సముచిత స్థానం కల్పించే విషయంలో అన్యాయం జరుగుతుందని ములుగు నియోజకవర్గ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రస్థాయిలో కనీసం జిల్లా స్థాయిలో ఉన్న ఏ ఒక్క పదవి కూడా దళిత వర్గాలకు దక్కకపోవడం అత్యంత శోచనీయమని కావున ఉమ్మడి వరంగల్ జిల్లాకు మరియు దళితునికి ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని పార్టీ అభివృద్ధి దృష్టిలో భాగంగా, అత్యంత వెనుకబడిన ములుగు నియోజకవర్గ దళిత వర్గాలకు రాష్ట్రస్థాయిలో సముచిత స్థానం కల్పించే విధంగా ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేసే ఎమ్మెల్సీ ఎంపికను ములుగు నియోజకవర్గ దళిత బిడ్డలకు అవకాశం కల్పించవలసిందిగా సుకుమార్ కోరారు.