మారుతి దర్శకత్వంలో ప్రభాస్ ‘రాజా డీలక్స్’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా డైరెక్టర్ మారుతి ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఆ అప్డేట్ ఏంటని ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. మూవీ టైటిల్‌కు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రభాస్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని టైటిల్ ఛేంజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ‘రాజా డీలక్స్’ను ‘రాజా సాబ్’గా మారుస్తున్నట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
