తన పెళ్లిపై వస్తున్న రూమర్స్‌పై స్టార్ నటి అంజలి స్పందించారు. బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యిందనే వార్తను ఆమె కొట్టిపడేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘ఇండస్ట్రీలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరిని కలిసినా లింకులు అంటగడుతున్నారు. ఒకసారి హీరో జైతో ఎఫైర్ ఉందన్నారు. ఇప్పుడు బిజినెస్‌మెన్‌తో పెళ్లి అంటున్నారు. నాకు ఎవరితో ఎఫైర్ లేదు. ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మీకు చెప్తాను.’ అని అన్నారు.
