ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. శుక్రవారం గ్రాండ్‌గా విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఓ వైపు థియేటర్లలో సందడి చేస్తుండగా.. మరోవైపు ఓటీటీ, శాటిలైట్ పార్ట్‌నర్స్ వివరాలు బయటకు వచ్చాయి. ఓటీటీ రైట్స్‌ను ‘జీ 5’, శాటిలైట్ రైట్స్‌ను ‘జీ టీవీ’ సొంతం చేసుకుంది. స్ట్రీమింగ్ తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదు.
