మన్యం న్యూస్ గుండాల: మండలం పరిధిలోని కొడవటంచ గ్రామానికి చెందిన ఈసం సమ్మక్క అనారోగ్యంతో మృతి చెందడంతో ఆమె పార్థివదేహానికి ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయసులోనే ఉద్యమంలో చేరి భూమి, భుక్తి, విముక్తి కోసం ఉద్యమాలు చేసిందని ఆయన అన్నారు. చంద్ర పుల్లారెడ్డి, రాధక్క, రామ నరసయ్య, బాటన్నతో కలిసి సాయిధ దళంలో ఉంటూ అనేక పోరాటాలు చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపందా ఇల్లందు డివిజన్ కార్యదర్శి శంకర్, పార్టీ నాయకులు వాంకుడోత్ అజయ్, సనప కుమార్, జగన్, ధర్మరాజ్, సత్యం తదితరులు పాల్గొన్నారు
