శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్’. శనివారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ అందుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ వివరాలు లీక్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తంలో చెల్లించినట్లు సమాచారం. నేటి నుంచి సరిగ్గా 45 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
