హనుమాన్ సినిమాకు నార్త్ ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. హిందీలో డబ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేస్తోందని సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ తెలిపారు. గతేడాదిలో లేనంత మంచి ఓపెనింగ్స్ హనుమాన్ సినిమాకు దక్కాయన్నారు. నార్త్ ఇండియాలో శుక్రవారం ఒక్కరోజే హిందీలో రూ. 2.15 కోట్లు, తెలుగు వెర్షన్‌లో రూ. 24 లక్షలు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది
