UPDATES  

 అమ్మ ఎక్కడున్నావు..?రెండు సంవత్సరాలగా మతిస్థిమితం లేని తన తల్లి కోసం గాలిస్తున్న విజన్ ఆంధ్ర రిపోర్టర్..

 

మన్యం న్యూస్ చర్ల

సృష్టిలో ప్రతి ప్రాణికి మూల కారణం అమ్మ. తాను మనల్ని తొమ్మిది నెలలు గర్భంలో మోసి పెంచి జన్మనిచ్చి ప్రపంచాన్ని కి మొదటగా పరిచయం చేసేదే అమ్మ.మనకు చిన్న దెబ్బ తగిలిన మనకంటే ముందు తల్లడిల్లిపోయేది తల్లి.

మాటలకు అందని అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే

సృష్టికర్త సృష్టించిన వాటిలో అమ్మను మించిన గొప్ప సృష్టి ఇంకొకటి లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తల్లి ప్రేమ దక్కించుకున్న వాడు అపర కోటీశ్వరుడు అని అంటారు. అదే విధంగా తల్లిని ప్రేమించువాడు కూడా దేవుని కంటే గొప్పవాడు అని ఖమ్మం జిల్లా ఆర్ జి కే కాలనీ కర్ణగిరి చర్చ్ బైపాస్ రోడ్ లో నివాసం ఉంటున్న ఈసం రాజు అలియాస్ వంశీ విజన్ ఆంధ్ర స్టేట్ బ్యూరో నిరూపించారు. ఇంట్లో నుంచి మతిస్థిమితం సరిగా లేకుండా మళ్లీ వస్తా అని చెప్పి వెళ్లిన తన తల్లి ఎన్ని రోజులైనా తిరిగి రాకపోవడంతో.

తన తల్లి కోసం రెండు సంవత్సరాల నుంచి తాను వెతుకుతున్నట్టుగా తెలిపాడు. ఖమ్మం జిల్లా అంతా తిరిగిన తన తల్లి జాడ దొరకలేదని కన్నీరు మునీరయ్యారు. చివరికి చర్ల మండలంలో ఉంది అని సరిగా నిర్ధారణలేని సమాచారంతో హుటాహుటిన బయలుదేరి కొండంత ఆశలతో వచ్చా నని తెలిపాడు. కానీ తన తల్లి ఇక్కడ కూడా కనిపించ లేదని తన గోడును మన్యం న్యూస్ ప్రతినిధికి విలపించాడు. ఈ పేపర్ ద్వారా గైన నా తల్లిని దొరికించండి అంటూ ప్రాధేయపడ్డాడు. తన తల్లి కనిపిస్తే తెలియజేయాలనితన ఇంటి అడ్రస్ తెలిపాడు .

తన అడ్రస్.

7-8-208 ఆర్ జి కే కాలనీ. కరుణగిరి చర్చ్ బైపాస్ రోడ్ ఖమ్మం. 8466009249.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !