సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయబోతున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో మూవీ చేయబోతున్నట్లు సందీప్ ప్రకటించాడు. రీసెంట్గా మహబూబాబాద్ జిల్లా దంతలపల్లికి సందీప్ రెడ్డి వెళ్లాడు. అక్కడ తనకు కావాల్సిన వారితో మనసులో మాట చెప్పాడు. తన ఫేవరేట్ హీరో రామ్ చరణ్‌తో సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు.
