2017 సంక్రాంతికి విడుదలైన ‘శతమానంభవతి’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ఇక తాజాగా దీనికి సీక్వెల్ తీయనున్నట్లు మేకర్స్ ఇవాళ అధికారికంగా ప్రకటించారు. శతమానం భవతి నెక్ట్స్ పేజీ అంటూ సినిమా టైటిల్‌ను ప్రకటించడంతో పాటు వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఎనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది రివీల్ చేయలేదు. మొదటి చిత్రానికి సతీశ్ వేఘేశ్న దర్శకత్వం వహించారు.
