అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘దివ్య్ అయోధ్య’ యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా నగరంలోని వివిధ ఆలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల గురించి తెలుసుకోవచ్చు. హోమ్‌స్టే, హోటళ్లు, గుడారాలు, వీల్‌చైర్ అసిస్టెంట్, గోల్ఫ్‌కార్ట్ వాహనాలు, ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, టూరిస్ట్ గైడ్లను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు.
