మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని మొగిలి తోగు గ్రామానికి చెందిన చుంచ రామయ్య-కుమారి దంపతుల కుమారుడు వంశి ఇటీవల జరిగిన యునివర్సిటీ నేషనల్ మీట్,ఆర్చెరీ క్రీడలలో గోల్డ్ మెడల్ సాదించిన చుంచ.వంశిని మంగళవారం పినపాక శాసనసభ్యులు పాయం.వెంకటేశ్వర్లు సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం నుంచి నేషనల్ మీట్ ఆర్చరీ క్రీడలలో గోల్డ్ మెడల్ సాదించిన చుంచ వంశిని ఆదర్శంగా యువత తీసుకోవాలని,యువత చదువుతోపాటు క్రీడలలో రాణించాలని అన్నారు. క్రీడలలో ప్రతిభ కనబర్చిన వంశిని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎర్ర.సురేష్,గొగ్గలి.రవి, పూనెం.బిక్షపతి,తోలెం. అర్జున్ తదితరులు పాల్గొన్నారు.