తేజా సజ్జ హీరోగా నటించిన ‘హనుమాన్’ సినిమా అరుదైన ఘనత సాధించింది. ఈ చిత్రం విడుదలైన 4 రోజుల్లోనే రూ.100 క్లబ్ లో చేరింది. స్టార్ హీరోల సినిమాలను సైతం లెక్కచేయకుండా సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్’.. టికెట్ రేట్లు పెంచకుండానే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టడం గమనార్హం. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేస్తూ.. ‘సినిమాల్లో ఇది నా తొలి సెంచరీ’ అని పేర్కొన్నారు. మంచిహిట్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
