UPDATES  

 ప్రశ్నించే గొంతుక, ప్రజా పక్షపాతి తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు..

 

మన్యం న్యూస్, మంగపేట.

బుధవారం అఖినేపల్లి మల్లారం కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు షేక్.మైనుద్దీన్ టి.పి.సి.సి రాష్ట్ర ప్రచార కమిటీ కో~ కన్వీనర్ తీన్మార్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి కార్యకర్తలకు స్వీట్లు పంచారు…అనంతరం వారు మాట్లాడుతూ మల్లన్న అంటేనే ప్రశ్నించే గొంతుక, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అతను ఏర్పరచుకున్నటువంటి క్యు న్యూస్ ఛానల్ ద్వారా ప్రజల సమస్యలను తీరుస్తూ పేద ప్రజలకు తనకు తోచినంత సహాయం చేస్తూ అడుగడుగునా ఎన్ని ఆటంకాలు ఎదురైన వెనకడుగు వేయకుండా ఇప్పుడు ప్రతిపక్షo లో ఉన్న బిఆర్ఎస్ పార్టీ తన పై ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైలు లో నిర్బంధించిన లెక్కచేయకుండా ప్రజా సమస్యలపై తనదైన శైలిలో గలం విప్పుతూ అహర్నిశలు కృషి చేస్తూ పేద ప్రజలకు సహాయం చేశారన్నారు..అలాగే పేద ప్రజలకు అన్ని వర్గాల కు సహాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తించి ఆయన కాంగ్రెస్ పార్టీ లో చేరనన్నారు. చేరిన అతి కొద్ది రోజుల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కో కన్వీనర్ గా అధిష్టానం తనకు బాధ్యత లు అప్పగించిందని ఆయన అన్నారు. పదవి స్వీకరించిన మల్లన్న కాంగ్రెస్ పార్టీ గెలుపు లక్ష్యంగా పనిచేసి అధికారo లోకి తీసుకొచ్చే విధంగా ఆయన కృషి ,తోడ్పాటు ఉందని కొనియాడారు.అదేవిధంగా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఈ ప్రజాపాలన ద్వారా అధికారులకు సమస్యలు విన్నవించుకోవచని అన్నారు… ఈ కార్యక్రమంలో గ్రామ కిసాన్ సెల్ అధ్యక్షులు కటుకూరి శేషయ్య, గ్రామ ఎస్సి సెల్ కార్యదర్శులు చెట్టుపల్లి చౌదరి,చెట్టుపల్లి రవి,దూలగొండ నారాయణ గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు చెట్టుపల్లి నానయ్య,సోమయ్య,వేణు,చిరంజీవి, వెంకన్న,చందర్ రావు అఖినేపల్లి మల్లారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు చెట్టుపల్లి ప్రణీథ్,మింటు,నవదీప్ మరియు పినపాక మండలం టి.కొత్తగూడెం నాయకులు పాడి ఈశ్వర్ రెడ్డి,దినసరుపు సీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !