సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఆ రెండు సినిమాలు మళ్లీ పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’ సినిమాలు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. హిట్ టాక్ అందుకున్న ఈ రెండు సినిమాలపై తెలుగులోనూ మంచి బజ్ క్రియేట్ అయింది. జనవరి 25న కెప్టెన్ మిల్లర్, 26న అయలాల్ థియేటర్లలో విడుదల కానున్నాయి.
