సూపర్‌స్టార్ మహేశ్ బాబు డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి అప్పుడప్పుడు విజయేంద్రప్రసాద్ పలు అప్‌డేట్‌లు తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఈ మూవీకి సంబంధించి మరో సాలిడ్ అప్ డేట్ ఇచ్చారు. రాజమౌళి-మహేష్ సినిమా కథ రాయటం పూర్తయిందని స్పష్టం చేశారు. అంతేకాదు, త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
