బాలీవుడ్‌లో నెపోటిజంపై దర్శకుడు వంగా సందీప్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఇండస్ట్రీలో కొనసాగుతున్న వాళ్లు సొంత వారినే ప్రమోట్ చేసుకోవడానికే ఆసక్తి చూపిస్తారని ఆరోపించారు. వాళ్లను వ్యతిరేకిస్తే ఎవరినైనా అణిచివేస్తారని, క్రూరంగా ప్రవర్తిస్తారని అన్నారు. ‘కబీర్ సింగ్’ సినిమా సమయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా.. నా అనుభవాలు చెప్పి చిన్నపిల్లాడిలా ఏడవాలని అనుకోవడం లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
