భారత్‌లో 28 ఏళ్ల తర్వాత మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. ఈ విషయాన్ని ఈవెంట్ నిర్వహకులు అధికారికంగా ప్రకటించారు. ‘మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని గర్వంగా ప్రకటిస్తున్నప్పుడు ఉత్సాహాన్ని నింపుతుంది. అందం, వైవిధ్యం, సాధికారత యొక్క వేడుక వేచి ఉంది. అద్భుత ప్రయాణానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఇండియాలో 1996లో చివరిసారిగా మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి
