మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలంలోని కత్తి గూడెం రాజుపేట గ్రామాలలో శనివారం ఇసుక క్వారీ నిర్వ హణ పిసా గ్రామ సభలను అధికారులు నిర్వహించారు. కత్తిగూడెంలో 12 మంది గిరిజన ఓటర్లు ఉండగా ఇసుక క్వారీ పిసా గ్రామ సభకు 12 హాజరై శ్రీ ఆంజనేయ ట్రైబల్ ఇసుక మొరం లేబర్ పరస్పర సహకార సంఘం లిమిటెడ్ రిజిస్టర్ సోసైటీకి ఇసుక నిర్వ హణ బాధ్యతలు ఇస్తునట్లు చేతులు ఎత్తి మద్దతు తెలి పారు.దానితో అక్కడ ఉన్న ఒకేఒక్క రిజిస్టర్ సోసైటీకి అధికారులు ఏకగ్రీవం చేశారు. అదేవిదంగా రాజుపేటలో నిర్వహించిన ఇసుక క్వారీ నిర్వహణ పిసా గ్రామ సభకు (1) శ్రీ కాళికాదేవి ట్రైబల్ సాండ్&మొరం క్వారీ లేబర్ కాంట్రాక్టు మ్యూచువల్ యిడెడ్ కో ఆపరేటివ్ సోసైటీ(2) శ్రీ కాళికా దేవి సాండ్ &మొరం క్వారీ లేబర్ కాంట్రాక్టు కో పరేటివ్ సొసైటీ రెండు సోసైటీలు రాగ గ్రామంలో ఉన్న 161 మంది గిరిజన ఓటర్లకు 89 మంది గ్రామ సభకు హాజరై శ్రీ కాళికాదేవి ట్రైబల్ సాండ్& మొరం క్వారీ లేబర్ కాంట్రాక్టు మ్యూచువల్ యిడెడ్ కో ఆపరేటివ్ సోసైటీకి ఇసుక క్వారీ నిర్వహణ బాధ్యతలు ఇస్తున్నట్లు 89 మంది చేతులు పైకి ఎత్తి ఎన్నిక చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుదర్శన్,ఎంపిఓ మమత, గ్రామ స్పెషల్ అధికారి రాజు,జిల్లా పిసా కోర్డినేటర్ ప్రభాకర్,పిసా జిల్లా అధ్య క్షులు డబ్బుల ముత్యాల రావు,కార్యదర్శి శ్రీధర్, రాజేష్,పాల్గొన్నారు.