UPDATES  

 సి సి రోడ్డు ను ప్రారంభించిన కాంగ్రెస్ నాయకులు ..

 

మన్యం న్యూస్ మంగపేట.

మంగపేట మండలం రాజుపేట గ్రామంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క చొరవతో మంజూరు చేసిన సీసీ రోడ్డు పనులను జిల్లా ఉపాధ్యక్షులు వల్లిపల్లి శివప్రసాద్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా కొంతకాలం గా ఆగిపోయిన అభివృద్ధి పనులు మరల ప్రారంభం కావటం తోఈ సారి అయినా దళిత, గిరిజన వాడల్లో రోడ్లు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తున్నారు.ఈ కార్యక్రమంలో.

నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఇస్సార్ ఖాన్, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్ర బాబు,జిల్లా ప్రచార కార్యదర్శి, సింగిల్ విండో డైరెక్టర్ కోడం బాలకృష్ణ, సింగిల్ విండో డైరెక్టర్ గంట సునీత రామారావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పల్లికొండ యాదగిరి, కిసాన్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చౌలం వెంకటేశ్వర్లు,బ్లాక్ కార్యదర్శి తుమ్మూరి రాంరెడ్డి, గ్రామ అధ్యక్షులు పొట్రూ సమ్మయ్య,సీనియర్ నాయకులు..

మాజీ సర్పంచ్ చందర్లపాటి శ్రీనువాస్, తుమ్మల ముఖర్జీ,అల్లపాటి శ్రీను, అణువుల రాఘవరెడ్డి, బోనుగు హనుమంతరావ్, పుల్లారావ్,నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !