మన్యం న్యూస్ గుండాల: ఆర్యవైశ్య సంఘం గ్రీన్ ఫీల్డ్ తొలి అధ్యక్షుడిగా మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుండాల, ఆళ్లపల్లి , కొమరారం, మాణిక్కారం, పోలారం, ఏడుప్పలగూడెం, పసివాగు గ్రామాలను కలుపుకొని ఆర్యవైశ్య సంఘం గ్రీన్ ఫీల్డ్ ను ఏర్పాటు చేశారు ఈ సమావేశం తొలిసారి శనివారం ఇల్లందు పట్టణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లపల్లి మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గౌరిశెట్టి శ్రీనివాస్ గుండాల మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు
