రామ్(ర్యాపిడ్ యాక్షన్ మిషన్) పేట్రియాటిక్ జానర్‌లో రూపొందిన ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో సూర్య అయ్యలసోమయజుల హీరోగా.. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ధన్యా బాలకృష్ణ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ సినిమా మీద అంచనాలు పెంచింది.
