యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ సినిమా విడుదలపై ఇటీవల రూమర్స్ వచ్చాయి. ఈ సినిమా అనుకున్న డేట్‌కి రిలీజ్ కాదంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. దీంతో తాజాగా ‘దేవర’ టీమ్ స్పందించింది. ‘ఎలాంటి మార్పులు లేవని, ఏప్రిల్ 5న దేవర సినిమాను రిలీజ్ చేస్తాం’ అని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది.
