నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ సాలిడ్ అప్‌డేట్‌తో స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ఎస్వీసీ సంస్థ అధినేత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఇక ఈ మూవీలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెర్సటైల్ స్టార్ ఎస్‌జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.
