UPDATES  

 ప్రభాస్‌ మూవీలో విజయ్‌ దేవరకొండ..?

‘సలార్‌’తో హిట్టు కొట్టి జోరు మీదున్న ప్రభాస్‌. ఇప్పుడు ఆ జోష్‌తోనే ‘కల్కి 2898ఎ.డి’ని పూర్తి చేసేందుకు రంగంలోకి దిగాడు. ప్రభాస్‌ – నాగ్‌ అశ్విన్‌ కలయికలో ఈ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. వైజయంతీ మూవీస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాలో కథానాయిక దీపిక పదుకొణె . ప్రతినాయకుడిగా కమల్‌హాసన్‌ నటిస్తున్నారు. బిగ్ బీ అమితాబ్‌, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 

ఈ సినిమాలో హీరో విజయ్‌ దేవరకొండ కూడా ఉంటాడని టాక్ నడుస్తోంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరవనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణలో పాల్గొంటున్నట్టు సమాచారం. అతడు ఏ పాత్ర పోషిస్తున్నాడనేది ఆసక్తిగా మారింది. గతంలో నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో విజయ్‌ ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘మహానటి’ సినిమాల్లో విజయ్ దేవరకొండ నటించాడు.

 

సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ముస్తాబవుతున్న ‘కల్కి ’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్‌ నారాయణన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !