సీతారాముల మీద ఉన్న భక్తితో ఓ చేనేతకారుడు చీర పై రామాయణ చరిత్రను చిత్రీకరించారు. పశ్చిమ బెంగాల్‌లోని రాణాఘాట్ పరిధిలో ఉన్న హబీబ్‌పూర్‌కు చెందిన పికుల్ రాయ్ అనే చేనేతకారుడు ఏడాదిపాటు కష్టపడి చీరపై రామాయణ చరిత్ర మొత్తాన్ని చిత్రించాడు. ఆ చీరను తీసుకుని ఆయన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి బయలుదేరాడు. చీరను కొనుగోలు చేస్తామని, పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామని కొందరు ఆయనను కోరినా తిరస్కరించారు. ఆయన చాలాకాలం నుంచి చేనేత పరిశ్రమలోనే ఉన్నారు. పికుల్ రాయ్‌కు సొంతంగా చీరల దుకాణం ఉంది.
ఏడాది కిందట రామాయణ చీర పనిని మొదలుపెట్టారు. ఆ చీరను పూర్తిగా చేతితోనే తయారు చేశాడు. ఎటువంటి రంగులను, ప్రింట్నుకానీ వాడలేదు. సీతారాముల వనవాసం గురించి చీరపై వివరించాడు. పికుల్ రాయ్ తన సోదరుడితో కలిసి శుక్రవారం రాత్రి హబీబ్పుర్ నుంచి అయోధ్యకు రైలులో బయలు దేరారు. ఆ చీరను సీతాదేవికి అలంకరించేందుకు ఇస్తానని ఆయన తెలిపారు.