ప్రముఖ నటి షకీలాపై చెన్నైలో దాడి జరిగింది. తన అన్న కుమార్తె శీతల్‌ను ఆమె పెంచుకుంటోంది. ఇంటి నుంచి శీతల్ వెళ్లిపోయిందని, తన సొంత తల్లిని తీసుకొచ్చి తనపై దాడి చేసిందని షకీలా పేర్కొంది. దీనిపై పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసింది. అయితే షకీలా తనపై దాడి చేసిందని శీతల్ ఆరోపించింది. ఇరువురి ఫిర్యాదులను పోలీసులు స్వీకరించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి, కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు
