మన్యం న్యూస్, మంగపేట.
తండ్రిని కోల్పోయిన తోటి స్నేహితుని పిల్లల చదువుకు సహాయం అందించి మేము ఉన్నాము అంటూ భరోసాని ఇచ్చిన స్నేహితులు.మంగ పేట మండలం అఖినే పల్లి మల్లారం గ్రామంకు చెందిన చెట్టు పల్లి హరిబాబు ఇటీవల అనారో గ్యంతో మృతి చెందారు. మృతి చెందిన చెట్టుపెల్లి హరి బాబుతో పాటు రాజుపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10 వ తరగతి వరకు కలసి చదువుకున్న హరిబాబు స్నేహితులు సోమవారం వారి ఇంటికి వెళ్లి భార్య పిల్లలను పరామర్శించి మృతుడు హరిబాబు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి మనోధైర్యం కల్పిం చారు.పిల్లల చదువుల నిమి త్తం టెన్త్ క్లాస్ స్నేహితులు అందరు ఇచ్చిన 21,000/- వేల రూపాయలను వారి భార్య పిల్లలకు అందజే శారు.ఈ కార్యక్రమంలో టెన్త్ క్లాస్ స్నేహితులు పాల్గొన్నారు.