ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ‘హనుమాన్’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో సముద్రఖని నటించారు. అయితే, ఈ పాత్ర కోసం ముందు తాను కన్నడ నటుడు రిషబ్ శెట్టిని అనుకున్నట్లు ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అప్పటికే ఆయన కాంతార చేసే పనుల్లో బిజీగా ఉన్నారని, అయితే, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఏదో ఒక సినిమా ఖచ్చితంగా చేస్తానని మాటిచ్చినట్లుగా తెలిపారు.





