కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’ ఇప్పటికే తమిళంలో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ మూవీ తెలుగు ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ క్రమంలో జనవరి 24న హైదరాబాద్‌లోని ఫిలింనగర్, జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని సాయంత్రం 6 గంటల నుంచి నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అనౌన్స్ చేశారు.





