మెగా కోడలు అనే ట్యాగ్ నటిగా తనపై మరింత బాధ్యత పెంచిందని లావణ్య త్రిపాఠి అన్నారు. ‘మిస్ పర్ఫెక్ట్’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో లావణ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లావణ్య త్రిపాఠి అనే పేరు తాను కష్టపడి సాధించించుకున్నానని, పెళ్లి తర్వాత వచ్చిన మెగా కోడలు అనే పిలుపు తనకు చాలా స్పెషల్ అని చెప్పారు. అలాగే, పెళ్లి తర్వాత సినిమాలు, పాత్రల ఎంపికలో వరుణ్ ఫ్యామిలీ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదన్నారు.





